జంగారెడ్డిగూడెం పట్టణంలోని స్థానిక నూకాలమ్మ ఆలయ సమీపంలో 4 అడుగుల త్రాచు పాము స్థానికులను హడలెత్తించింది. జగదీశ్ అనే వ్యక్తి ఇంట్లో ఉన్న చెప్పుల పెట్టెలో ఈ పామును గుర్తించారు. వెంటనే స్నేక్ సేవియర్స్ సొసైటీ సంస్థ అధ్యక్షుడు చదలవాడ క్రాంతికి సమాచారం అందించారు. అతను పాముని సురక్షితంగా పట్టుకొని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టినట్లు తెలిపారు.