తిరుపతి దేవస్థానంలో శ్రీస్వామి వారి ప్రసాదం లడ్డు తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించడంపై విచారణ చేయాలని మండవల్లి హిందు భక్త సమాజం శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగదైవం వెంకటేశ్వరస్వామి లడ్డు తయారీకీ ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని ఎన్ డి డి బి రిపోర్టులో వెల్లడైందన్నారు. టిటిడి ఈఓ శ్యామలరావు కూడా వంద శాతం కల్తీ జరిగిందని శుక్రవారం మీడియాకు తెలిపారన్నారు.