నరసాపురం మండలం వేములదీవి గ్రామంలో పోతాబత్తుల ఈశ్వర్ రావు అనే వ్యక్తి ఏఓఎస్ డి వ్యాధితో బాధపడుతున్నారు. వైద్యానికి రూ. 5 లక్షల వరకు అవసరమని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్ధిక స్థోమత సరిపోకపోవడంతో ఈ విషయం నరసాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ దృష్టికి తీసుకు వెళ్లారు. తక్షణమే ఎమ్మెల్యే నాయకర్ స్పందించి బుధవారం వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ. 2, 50, 000 మంజూరు చేయించారు.