పశ్చిమగోదావరి జిల్లాలో శనివారం ముగ్గురు నకిలీ పోలీసులు హల్ చల్ చేశారు. వివరాల్లోకి వెళితే మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌కు విహార యాత్రకు వెళ్తున్న వారిని అడ్డగించి పోలీసులమంటూ బెదిరించి డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నారు. మొగల్తూరు పోలీస్ స్టేషన్లో బాధితుల ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు భీమవరానికి చెందిన ముగ్గురు నకిలీ పోలీసులను అదుపులోకి తీసుకున్నారు.