పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం శ్రీ చైతన్య పాఠశాలలో స్మార్ట్ లివింగ్ కార్యక్రమం క్రింద "సేఫ్ ఇండియా" కార్యక్రమం బుధవారం నిర్వహించారు. పెనుగొండ పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ కె. గంగాధర్ ముఖ్యఅతిథిగా పాల్గొని, మైనర్లు వాహనాలు నడపరాదని, ట్రాఫిక్ సిగ్నల్స్, నిబంధనలపై అవగాహన కల్పించారు. విద్యార్థులకు హెల్మెట్ ధరించేలా సూచించారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు.