మొగల్తూరు: లింగేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ మొగల్తూరులో శ్రీ భ్రమరాంబ వనమల్లికార్జున లింగేశ్వర స్వామి ఆలయంలో ఆఖరి సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అభిషేకాలు నిర్వహించారు. నేరుగా శివలింగానికి భక్తులు పాలు అవు నెయ్యి పెరుగు కొబ్బరికాయ పువ్వులు సమర్పించారు. అనంతరం ఆలయాల్లో ఏర్పాటు చేసిన ప్రసాదం సేకరించారు. ఆలయ కమిటీ అన్ని ఏర్పట్లు చేశారు.