రైతులను దళారులు దోచుకుంటున్నారని నరసాపురం ఆర్డీఓ దాసిరాజు అన్నారు. శుక్రవారం మండలంలోని సీతారాంపురం నార్త్ గ్రామంలో రైతు సేవా కేంద్రాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. రైతు సేవా కేంద్రంలో వరి తేమశాతం తెలిపే టెక్నికల్ మిషన్ను, రిజిస్టర్లు పరిశీలించారు. రైతు సేవా కేంద్రం ద్వారా రైతుల నుంచి ఎంత ధాన్యం సేకరణ, సంబంధించిన రైతుల ఖాతాలలో 48 గంటలలో డబ్బులు జమ అవుతున్నాయా? తదితర వివరాలు తెలుసుకున్నారు.