పోడూరు మండలం జిన్నూరు గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా సోమవారం విద్యార్థులకు దేశభక్తి గీతాల పోటీలు నిర్వహించారు. ఇందులో 80 మంది విద్యార్థులు పరీక్షాలు రాశారు. ఈ కార్యక్రమాన్ని గ్రంథాలయ అభివృద్ధి కమిటీ కార్యదర్శి ఇందుకూరి సూర్యనారాయణ రాజు, సహాయ కార్యదర్శి తాళాబత్తుల వెంకటేశ్వరరావులు పర్యవేక్షించగా కె భారతి, వియస్ఎన్ మూర్తి, కాటం శిరీష, అన్నపూర్ణేశ్వర రావులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.