కృష్ణా: భార్యపై కోపంతో భర్త ఆత్మహత్య
ఆనందపురం గ్రామంలో భార్యపై కోపంతో పుల్లేరు కాలువలో దూకి ఒకరు మృతి చెందిన సంఘటన శనివారం పెనమలూరు నియోజకవర్గంలో చోటుచేసుకుంది. ఉయ్యూరు మండలం ఆనందపురం గ్రామంలో బిట్రా పోతురాజు తన భార్యతో గొడవ పడి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.