జీలుగుమిల్లి మండలం తపస్సుగూడెం గ్రామానికి చెందిన చిన్నారులు లిఖిత వర్ధన్ (2), విహాన్ (2)లు సోమవారం ఇంటి సమీపంలో ఆడుకుంటూ గుర్తుతెలియని ఒక చెట్టు కాయలు తిని అస్వస్థతకు గురయ్యారు. గమనించిన తల్లిదండ్రులు తొలుత జీలుగుమిల్లి ఆసుపత్రికి అక్కడి నుంచి జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు.