పెంటపాడులో 57వ గ్రంథాలయ వారోత్సవాలు

58చూసినవారు
పెంటపాడులో 57వ గ్రంథాలయ వారోత్సవాలు
గ్రంథాలయాల అభివృద్ధికి అయ్యంకి వెంకటరమణయ్య కృషి చేశారని ఎంఈవో ఎం. శ్రీనివాస్ అన్నారు. శనివారం పెంటపాడు 57వ శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించారు. గ్రంథాలయాల అభివృద్ధికి అందరి సహకారం అవసరమని శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో మానవత సేవా సంస్థ చైర్మన్ తాడేపల్లి మోహన్ రావు, అధికారి జుల్ఫికర్ అలీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.