తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెం,తెలికిచర్ల రహదారిలో ఆదివారం ఏరియా ప్రెస్ క్లబ్ నిర్వహించిన కార్తీక వన సమారాధన ఘనంగా జరిగింది. కార్యక్రమంలో వైసీపీ రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురాం నాయుడు మాట్లాడుతూ ప్రజలలో సామాజిక స్పృహ కలిగించే పాత్రికేయుల పాత్ర అమూల్యమని అన్నారు. జడ్పిటిసి ఆంజనేయులు, సురేష్, బుజ్జి పాల్గొన్నారు.