గడిచిన 24 గంటల వ్యవధిలో పశ్చిమగోదావరి జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ అధికారులు శుక్రవారం వెల్లడించారు. జిల్లాలో కేవలం ఇరగవరం మండలంలో మాత్రమే 5. 4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు చెప్పారు. మిగిలిన 19 మండలాల్లో ఎలాంటి వర్షపాతం నమోదు కాలేదని తెలిపారు. జిల్లాలో సరాసరి 0. 3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు.