కాళ్ల మండలం ఏలూరుపాడులో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ ఫ్లెక్సీకి జరిగిన అవమానాన్ని ఖండిస్తూ నూజివీడులో దళిత సంఘాల నాయకులు నిరసన తెలిపారు. ఈ మేరకు ఆదివారం నూజివీడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజ పర్యటనలో భాగంగా అంబేద్కర్ ఫ్లెక్సీని చింపి వేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసి, ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు.