పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ లో ఆదివారం రౌడీషీటర్లకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడారు. సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని చెడు నడత గలవారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అలాగే ప్రజాశాంతికి భంగం కలిగిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.