వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొన్న టీడీపి జిల్లా అధ్యక్షుడు

50చూసినవారు
వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొన్న టీడీపి జిల్లా అధ్యక్షుడు
కాళ్ళ మండలం కలవపూడి గ్రామంలో వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ఆదివారం ఏర్పాటు చేసిన అఖండ అన్న సమారాధన కార్యక్రమంలో ప. గో. జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మంతెన రామరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొనే భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేశారు.

సంబంధిత పోస్ట్