విజయవాడలోని 'ఏ ప్లస్ కన్వెన్షన్'లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరుపున జరిగిన "సెమీ క్రిస్మస్" వేడుకలు సోమవారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ క్రమంలో ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు కూడా పాల్గొన్నారు. అనంతరం వారు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.