గ్రామీణ ప్రాంతాల్లో కుట్టు శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు తపన ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని బిజెపి ఉంగుటూరు నియోజకవర్గ కన్వీనర్ శరణాల మారుతీ రాణి అన్నారు. ఉంగుటూరు మండలం రాచూరు గ్రామంలో బుధవారం తపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణా కేంద్రాన్ని మాలతీ రాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2008 నుంచి తపన ఫౌండేషన్ ద్వారా సేవలందిస్తున్నట్లు తెలిపారు.