ఏపీకి తుఫాను ముప్పు తప్పింది. 'ఫెంగల్'తో ఇబ్బందులు పడిన దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల వైపు వచ్చిన అల్పపీడన ప్రభావం రాష్ట్రంపై పెద్దగా ఉండదని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం వాయుగుండంగా బలపడి శ్రీలంక, తమిళనాడు తీరాల వైపు వెళ్లి తీరం దాటుతుందని చెప్పింది. దీని ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు.. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయంది.