బ్రిటన్‌లో క్రిమినాలజీ అభ్యసిస్తున్న విద్యార్థి నాసెస్ సాడీ (20) కనీవినీ ఎరుగని దారుణానికి ఒడిగట్టాడు. హత్య చేస్తే ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఓ మహిళను కత్తితో పొడిచి అంతమొందించాడు. అతడి దాడిలో ఏమీ గ్రే (34) అనే మహిళ మృతి చెందగా ఆమె స్నేహితురాలు లియాన్ మైల్స్ (38) తీవ్ర గాయాల పాలయ్యారు. తనకు కత్తులు అంటే ఇష్టమని సాడీ చెప్పినట్టు జైలు అధికారి ఒకరు మీడియాతో పేర్కొన్నారు.