AP: విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించబోతుంది. ఉదయం 9 గంటలకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ వేడుకల్లో భాగంగా సాయుధ దళాల గౌరవ వందనాన్ని గవర్నర్ స్వీకరించనున్నారు. స్టేడియంలో కవాతు ఉంటుంది. ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన కూడా ఉంటుంది.