గోవా స్వాతంత్ర్య పోరాటంలో కీలకంగా వ్యవహరించారు లిబియా లోబో సర్దేశాయ్. ఓ క్యాథలిక్ క్రైస్తవ కుటుంబంలో 1924లో జన్మించిన ఆమె, పోర్చుగీసు పాలన నుంచి విముక్తి కోసం ఉద్య మించారు. వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్(Voz da Liberdade) పేరిట అక్కడ 1955లో ఓ భూగర్భరేడియో కేంద్రాన్ని నడిపి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేశారు. గోవాను భారత్లో కలిపేందుకు అప్పట్లో ప్రాణత్యాగానికి సైతం ఆమె సిద్ధం కావడం గమనార్హం.