తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజా కేంద్రం అజిత్ కుమార్‌కు దేశంలోనే మూడో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అజిత్ ఆనందం వ్యక్తం చేస్తూ… ఎమోషనల్ పోస్ట్ చేశారు. 'ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేయడం గౌరవంగా భావిస్తున్నా. భారత రాష్ట్రపతి, ప్రధానికి హృదయపూర్వక ధన్యవాదాలు. సినీ పరిశ్రమలో ఎంతో మంది నాకు సహకరించారు. వారందరికీ ధన్యవాదాలు. ఈ రోజును చూసేందుకు నా తండ్రి జీవించి ఉంటే ఎంతో బాగుండేదనిపిస్తుంది. నన్ను చూసి ఆయన గర్వపడేవారు.' అని ట్వీట్ చేశారు.