గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం వైన్ షాపులు, మాంసం దుకాణాలు కానున్నాయి. జంతువులను వధించరాదని, అన్ని చికెన్, మటన్, ఫిష్ మార్కెట్లు మూసివేయాలని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సూచించింది. ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. చాలా పట్టణాల్లో ఇదే తరహా ఆదేశాలు జారీ అయ్యాయి.