గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లో ఆదివారం ట్రాఫిక్ అంక్షలు అమల్లోకి రానున్నాయి. ఉదయం 7.30 గంటల నుంచి 11.30 వరకు సిక్రింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు రాజ్‌భవన్ పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాలైన టివోలీ ఎక్స్ రోడ్స్, ప్లాజా ఎక్స్ రోడ్స్ మార్గాలను మూసివేయనున్నట్లు తెలిపారు.