TG: కరీంనగర్ బైపాస్ రోడ్డులో మహిళా అఘోరీ రాష్ డ్రైవింగ్ ఉద్రిక్తతకు దారి తీసింది. వాహనదారులకి, అఘోరీకి మధ్య వాగ్వాదం జరిగింది. తోపులాటలో అఘోరీ వాహనం అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు అఘోరీని అక్కడి నుంచి పంపించారు. లేదంటే న్యూసెన్స్ కేసు పెడుతామని హెచ్చరించారు. దీంతో అఘోరీ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో అఘోరీ హల్చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే.