టీడీపీ ఎమ్మెల్యేకు మాజీ మంత్రి సవాల్

57చూసినవారు
టీడీపీ ఎమ్మెల్యేకు మాజీ మంత్రి సవాల్
టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం నెల్లూరులో మాజీ మంత్రి కాకాణి మాట్లాడుతూ.. ఇసుక అక్రమ రవాణాలో తనకు సంబంధం ఉందని సోమిరెడ్డి చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. సూరాయిపాలెం ఇసుక రీచ్‌లో జరుగుతున్న తవ్వకాలపై గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్తామని తెలిపారు. ఇసుక అక్రమ రవాణాలో తనకు సంబంధం ఉందని నిరూపించాలని మాజీ మంత్రి కాకాణి సవాల్ విసిరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్