నేడు సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ప్రమాణ స్వీకారం

52చూసినవారు
నేడు సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ప్రమాణ స్వీకారం
నేడు భారతదేశ 51వ ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ప్రమాణం చేయనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. సీజేఐగా జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ పదవీకాలం ఆదివారంతో ముగిసింది. దీంతో ఆయన స్థానంలో బాధ్యతలు స్వీకరించనున్న జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా.. 2025 మే 13 వరకు సీజేఐగా కొనసాగనున్నారు.

సంబంధిత పోస్ట్