పర్యావరణ పరిరక్షణ దిశగా ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయడంలో అత్యంత కీలకమైన ‘కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (కాప్)’ 29వ సదస్సు అజర్‌బైజాన్ రాజధాని బాకు వేదికగా ఇవాళ ప్రారంభంకానుంది. వాతావరణాన్ని కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రపంచ నేతలు ఇందులో చర్చించనున్నారు. ప్రధాని మోదీ ఈ సదస్సుకు హాజరుకావడం లేదు. మనం దేశం తరపున 19 మంది సభ్యుల బృందం పాల్గొంటుంది.