మీ భర్త ఎవరో వివరణ ఇవ్వండని దేవాదాయశాఖ సహాయ కమిషనర్ కె.శాంతికి ఆ శాఖ కమిషనర్ నోటీసులిచ్చారు. ‘2020లో ఉద్యోగంలో చేరినప్పుడు, సర్వీస్ రిజిస్టర్‌లో, ప్రసూతి సెలవుల కోసం దరఖాస్తు చేసినప్పుడు భర్త పేరు కె.మదన్‌మోహన్ అని నమోదు చేయించారు. ఈ నెల 17న పి.సుభాష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకోవడం ఉద్యోగి ప్రవర్తనా నియమావళికి విరుద్ధమని, దీనిపై వివరణ ఇవ్వాలి‘ అని కోరారు.