మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు గడువు పొడిగింపు

70చూసినవారు
మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు గడువు పొడిగింపు
ఏపీలోని 164 మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు గడువును పాఠశాల విద్యాశాఖ వచ్చే నెల 6 వరకు పొడిగించింది. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 21న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తామంది. 5వ తరగతి స్థాయిలో తెలుగు/ఇంగ్లిష్ మీడియంలో పరీక్ష ఉంటుందని పేర్కొంది. ఎంపికైన వారికి విద్యాభ్యాసం ఇంగ్లిష్‌లోనే ఉంటుందని వెల్లడించింది. మరిన్ని వివరాలకు https://apms.apcfss.in/ వెబ్ సైట్‌లో సంప్రదించాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్