భార్య వేధిస్తుండడంతో ఆత్మహత్య చేసుకున్న బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ (34) కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో భార్య నిఖితా సింఘానియా, అత్త నిశా, బావమరిది అనురాగ్‌ను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. ఆత్మహత్యకు ముందు తన మరణానికి అత్త కుటుంబమే కారణమంటూ అతుల్ లేఖ రాయడంతో దాని ఆధారంగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.