వరదల కారణంగా విజయవాడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు కోలుకుంటున్నాయి. అయితే విజయవాడ నగరపాలక సంస్థ ఇంటి పన్ను వసూలు చేస్తోందని, 15 రోజుల్లో చెల్లించకపోతే పెనాల్టీ పడుతుందని హెచ్చరిస్తున్నారని సీహెచ్ బాబురావు అనే వ్యక్తి ఆరోపించారు. వరద బాధితులకు అండగా ఉంటానన్న ప్రభుత్వం ఇంటి పన్ను చెల్లించమని ఎలా అడుగుతుందని ఆయన ప్రశ్నించారు. వరద ప్రాంతాల్లో ఇంటి పన్ను, ఇతర ఛార్జీలు పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.