AP: తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి అంబటి రాంబాబు దర్శించుకున్నారు. అయితే వైసీపీ అధ్యక్షుడు జగన్ ఫొటో ఉన్న స్టిక్కర్‌ను చొక్కాపై అంటించుకొని తిరుమలకు రావడం చర్చనీయాంశమైంది. రాజకీయ పార్టీల చిహ్నాలు, జెండాలు, స్టిక్కర్లతో శ్రీవారి దర్శనానికి రావడం టీటీడీ నిబంధనలకు విరుద్ధం. అయినా అంబటి రాంబాబు తన చొక్కాపై జగన్ ఫొటో ఉన్న స్టిక్కర్‌తో రావడంపై పలు విమర్శలొస్తున్నాయి.