దాయాది దేశం పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ రాజధాని లాహోర్‌లో వాయు కాలుష్యం తీవ్రమైంది. అక్కడ గాలి నాణ్యత ప్రమాదకరస్థాయికి చేరింది. స్థానిక అధికారుల ప్రకారం.. లాహోర్‌లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 1,067 పాయింట్లు నమోదైంది. దీంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఇవాళ్టి నుంచి ప్రాథమిక పాఠశాలలను వారం రోజుల పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలు సైతం ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం ఆదేశించింది.