అంతరిక్షంలో అరుదైన ఘట్టం చోటుచేసుకోనుంది. భూమి నుంచి నేరుగా చూడగల నక్షత్రాల్లో ఒకటైన స్పైకా ఈనెల 27న గంటపాటు మాయం కానుంది. ఆ రోజు చందమామ ఈ తెలుపు, నీలి కాంతుల తారకు తెరగా అడ్డు వస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అమెరికా తూర్పు ప్రాంతంతో పాటు కెనడాలో దీన్ని చూడవచ్చు. 27న ఉదయం 5.50కు స్పైకా అదృశ్యమై గంట తర్వాత మళ్లీ దర్శనమివ్వనుంది.