మునక్కాయలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీర రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. బీపీతో బాధపడేవారు రెగ్యులర్‌గా మునక్కాయను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పొటాషియం రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. మునక్కాయల్లో ఉండే కాల్షియం ఎముకలను దృఢంగా మార్చుతుంది. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులోని ఫైబర్ కంటెంట్ మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలను తగ్గిస్తుంది.