మంత్రికి మాజీ ఎంపీ సూచ‌న‌

58చూసినవారు
మంత్రికి మాజీ ఎంపీ సూచ‌న‌
AP: మంత్రి వాసంశెట్టి సుభాష్ పై అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ మండిపడ్డారు. వాసంశెట్టి సుభాష్ అనుచరులమంటూ అంబాజీపేట మండలం పసుపల్లి గ్రామానికి చెందిన గంటి కిరణ్‌పై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. అమలాపురం ఏరియా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న గంటి కిరణ్‌ను అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి సుభాష్ కు ఇది మంచి పద్దతి కాదన్నారు. చిన్న వయస్సులో మంత్రి అయినందుకు ఆ గౌరవాన్ని కాపాడుకోవాలని హితవు పలికారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్