బఢిల్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో ఫుల్ బిజీగా ఉన్నాయి. అయితే ఈ క్రమంలో బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ 'సంకల్ప పత్రం' అనే పేరుతో మంగళవారం మరో మ్యానిఫెస్టోను విడుదల చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే నిరుపేద విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు రూ.15 వేల ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటించారు.