ఆకాశంలో ఒక అద్భుతమైన ఖగోళ దృశ్యం ఇవాళ రాత్రి కనిపించనుంది. మన సౌర వ్యవస్థలోని ఆరు గ్రహాలు అంగారక గ్రహం, బృహస్పతి, యురేనస్, నెప్ట్యూన్, శుక్రుడు, శని ఒక సరళ రేఖలోకి రానున్నాయి. ఈ అరుదైన గ్రహాల అమరిక రాబోయే కొన్ని వారాల పాటు కనిపించనుంది. జనవరి 21న ఈ అమరిక ప్రారంభమవుతుంది. ఈ అమరికను సూర్యాస్తమయం అయిన 45 నిమిషాల తర్వాత వీక్షించవచ్చు.