తమ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని చెప్పారు. త్వరలోనే ఏపీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు.