వినాయక చవితి సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలని గుంటూరు తూర్పు సబ్ డివిజన్ ఇన్చార్జి డీఎస్పీ సుబ్బారావు తెలిపారు. శుక్రవారం కొత్తపేట పోలీస్ స్టేషన్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. మండపాలు నిర్మించేటప్పుడు వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రోడ్డు పక్కన నిర్మించుకోవాలన్నారు. రాత్రి 10గంటల తర్వాత సౌండ్ సిస్టం వాడరాదని తెలిపారు.