14ఏళ్ల లోపు పిల్లలు ప్రమాదకర వృత్తులు చేయడం నిషేధమని తుళ్లూరు ఎస్ఐ అంకమ్మ అన్నారు. బుధవారం తుళ్లూరు మండలంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆపరేషన్ ముస్కాన్ ద్వారా బాల కార్మికులను గుర్తించి శిశు సంక్షేమ శాఖకు అప్పగిస్తున్నట్లు చెప్పారు. ఆపదలో ఉన్న పిల్లలు 1098, లేదా 100కి ఫోన్ చేసి రక్షణ పొందవచ్చని సూచించారు.