తుళ్ళూరు: ఆధార్ క్యాంపు సద్వినియోగం చేసుకోవాలి: ఎంపీడీఓ
తుళ్ళూరు మండలంలో ప్రత్యేకంగా విద్యార్థుల కోసం నిర్వహించే ఆధార్ క్యాంపు సద్వినియోగం చేసుకోవాలని తుళ్ళూరు ఎంపీడీఓ శిల్ప కానూరి సోమవారం తెలిపారు. తుళ్ళూరు గ్రామంలోని విద్యార్థులు 19, 20వ తేదీల్లో తుళ్ళూరు హై స్కూల్ వెనుక ఉన్న కాలేజీలో, 21వ తేదీన మేరీమాత స్కూల్లో, 22వ తేదీన తుళ్ళూరు పటమట వీధి వద్ద ఉన్న కాలేజీలో, 19-22 మందడం గోల్డెన్ రూల్ స్కూల్ లో ఆధార్ క్యాంపు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.