గుంటూరు జిల్లా తెనాలిలో మంగళవారం కుండపోత వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణంలో మార్పు చోటు తీసుకోవడంతో కారుమబ్బులు కమ్ముకున్నాయి. ఉరుములు, మెరుపులు, పిడుగుల శబ్దాలతో రెండు గంటల పాటు వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో తెనాలి పట్టణంలోని నందులపేటలో చెట్టుపై పిడుగు పడటంతో ఒక ఆటో సహా రెండు ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయినట్లు స్థానికులు తెలిపారు.