Nov 07, 2024, 01:11 IST/
త్వరలో డీఎస్సీ-2008 బాధితులకు కాంట్రాక్టు టీచర్లుగా ఛాన్స్
Nov 07, 2024, 01:11 IST
DSC-2008లో నష్టపోయిన 2,367 మంది అభ్యర్థులను కాంట్రాక్టు టీచర్లుగా నియమించేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు ముమ్మరం చేసింది. నష్టపోయిన వారు తమ పేర్లు నమోదు చేసుకోవాలని SEP నెలాఖరులో విద్యాశాఖ కోరింది. ఈ క్రమంలో ఆయా ధ్రువపత్రాలను పరిశీలించి వారికి కొలువులు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. SRD, NGL, RR, హనుమకొండ, KMM, NZD, ఆదిలాబాద్, KRMR, MBNR జిల్లాల్లో బాధితులున్నట్లు గుర్తించారు. ఈ నెల 8లోపు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.