2026లో గెలిచేది మేమే.. నటుడు విజయ్‌కు డిప్యూటీ సీఎం వార్నింగ్

571చూసినవారు
2026లో గెలిచేది మేమే.. నటుడు విజయ్‌కు డిప్యూటీ సీఎం వార్నింగ్
రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకున్న నటుడు విజయ్‌‌కు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. 2026లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా డీఎంకే గెలిచి తీరుతుందని.. తమను ఎదుర్కొనే సత్తా ఏ పార్టీకీ లేదన్నారు. తమిళనాడులోని విల్లుపురంలో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఉదయనిధి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘వాళ్లు ఎవరితో చేతులు కలిపినా ఫర్వాలేదు. గెలిచేది మాత్రం డీఎంకే’’ అని ఉదయనిధి విశ్వాసం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్