అచ్చంపేట: అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య
అచ్చంపేట మండలంలోని మాదిపాడు పంచాయతీ పరిధిలో గల గింజుపల్లి తండాలో కౌలు రైతు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం రాత్రి జరిగింది. పోలీసులు వివరాల మేరకు గింజుపల్లి తండాలో నివసించే కౌలు రైతు బాణావత్ హనుమాన్నాయక్ (40) తనకు గల సొంత పొలం 75 సెంట్లుతో పాటు ప్రతి ఏటా మూడు ఎకరాలను కౌలుకి తీసుకొని సాగు చేస్తుంటాడు. సాగు పెట్టుబడి కోసం ప్రతి ఏటా అప్పులు చేశాడు. చేసిన అప్పు తిర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు.