వేములవాడ పట్టణంలోని తిప్పాపురం బస్టాండ్ ప్రాంతంలో ప్రతి రోజు ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. అంటే అర్థం చేసుకోవచ్చు ఈ ప్రాంతంలో ఉన్న రోడ్డు, అస్తవ్యస్తంగా వస్తున్న ఆర్టీసీ బస్సులు, వాహనదారుల సమన్వయ లోపంతో ప్రతిరోజు ఈ ప్రాంత వాస్తవ్యులకు, రాజన్న దర్శనం వచ్చే భక్తులకు ట్రాఫిక్ జామ్ ఏర్పడడం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. దీనిపై సంబంధిత అధికారులు చొరవ తీసుకొని సమస్య పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.