ఫార్ములా-ఈ రేస్ కేసులో అణాపైసా అవినీతి లేదని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR వ్యాఖ్యానించారు. 'పొన్నం మాటలతో ఈ కేసులో అవినీతి లేదని తేలింది. ప్రభుత్వం కేసుపై ముందుకు వెళ్తే న్యాయపరంగా ఎదుర్కొంటాం. HMDA చేసే ప్రతి పనికి ప్రభుత్వ అనుమతి అవసరం లేదు. HMDA ఒక కార్పోరేషన్.. హైదరాబాద్ డెవలప్ మెంట్ కు ఉపయోగపడే ఏ కార్యక్రమానికైనా డబ్బులు ఖర్చు చేయవచ్చని చట్టంలోనే ఉంది' అని శుక్రవారం నిర్వహించిన మీడియాతో చిట్‌చాట్‌లో చెప్పారు.